Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

అనుబంధము
మంగళాచరణములు

శ్రీ కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులు

ఆదిమశంకర భగవ

త్పాదకృపారాజ్య సార్వభౌములకు దపః

శ్రీదయితులకు జగద్గురు

పాదులకివె ఆంధ్రవసుధ పక్షమున నతుల్‌ ||

దండితరిపులకు వర కో

దండీభవ దాత్మదండ దండిత పరమో

ద్ధండతర దండధరుల క

ఖండ తమశ్చండ చండకరులకు వినుతుల్‌ ||

ఓంకార స్వర సర ప

ల్యంకిక నూరేగు పరమహంసకు నిజపా

దాంకిత వికచ సహస్ర ద

ళాంకుర మకరంద తర్పితాత్మీయులకున్‌ ||

శ్రీ కామకోటి పీఠా

గ్రాకల్పుల కాంధ్రవిజయ యాత్రాలోక

శ్రీకృతి కృతకృత్యజన

శ్రీ కల్పుల కివే కిరీట శృంగారమ్ముల్‌ ||

( శ్రీ కామకోటి జగద్గురు సువర్ణ రుద్రాక్షమణి కిరీటోత్సవ సందర్భమున ఏలూరులో సమర్పితము)


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page